శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం వద్ద భక్తుల ఆందోళన
తిరుమల, 25 డిసెంబర్ (హి.స.) తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీవాణి విఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద గురువారం భక్తులు ఆందోళనకు దిగారు. రూల్స్ ప్రకారం ఉదయం 10 గంటలకు టికెట్లు ఇవ్వాల్సి ఉండగా.. సుమారు 9:30 గంటల నుంచే జారీ ప్రారం
తిరుమల


తిరుమల, 25 డిసెంబర్ (హి.స.)

తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీవాణి విఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద గురువారం భక్తులు ఆందోళనకు దిగారు. రూల్స్ ప్రకారం ఉదయం 10 గంటలకు టికెట్లు ఇవ్వాల్సి ఉండగా.. సుమారు 9:30 గంటల నుంచే జారీ ప్రారంభించారని భక్తులు ఆరోపించారు. రాత్రి నుంచే వందలాది మంది క్యూలో నిలబడినా, ముందుగానే టికెట్లు ఇవ్వడంతో చివర్లో ఉన్నవారికి టికెట్లు దక్కకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కౌంటర్ ఎదుట నిరసనకు దిగుతూ టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అధికారులపై విమర్శలు చేశారు.

సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను నచ్చజెప్పడంతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. అనంతరం టీటీడీ అధికారులు టికెట్ల జారీ ప్రక్రియను క్రమబద్ధంగా కొనసాగించారు. శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని, కౌంటర్‌ల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఆన్‌లైన్ బుకింగ్‌ను ఎంచుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande