
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.) క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని క్రైస్తవ సోదరసోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు ప్రపంచ మానవాళికి ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు.
క్రీస్తు ఉపదేశాలను ఆదర్శంగా తీసుకుని అన్ని మతాల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని క్రైస్తవుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు