
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గల్లీ స్థాయి నాయకుడు అని మల్లొకసారి నిరూపించుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ కాలి గోటికి సరోపోడు అని మేము కూడా అనొచ్చు.. కానీ అనడం లేదన్నారు. మీకు అది ఒక్క భాషనే వచ్చు కావొచ్చు మాకు అన్ని భాషలు వచ్చన్నారు. ఇతరుల చావు కోరుకోవడం అనేది రండ గాళ్లు చేసే పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీది కేసీఆర్ స్థాయి కాదని గుర్తు పెట్టుకో అంటూ మండిపడ్డారు.
సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలే బండ రాళ్లు కట్టి మూసీలో వేస్తారని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు