అరుణాచల్ ప్రదేశ్ భారత్ దే అని చెప్పిన యూట్యూబర్కు చైనా విమానాశ్రయంలో వేధింపులు
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.) అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని చెప్పిన యూట్యూబర్కు చైనా విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ ట్రావెల్ వ్లాగర్ ''ఆన్ రోడ్ ఇండియన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్నాడు. అయితే గతంలో అరుణాచల్
యూట్యూబర్కు చైనా వేధింపులు


హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)

అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో

అంతర్భాగం అని చెప్పిన యూట్యూబర్కు చైనా విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ ట్రావెల్ వ్లాగర్ 'ఆన్ రోడ్ ఇండియన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్నాడు. అయితే గతంలో అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగం అంటూ వీడియో చేశాడు. ఇటీవల అతడు చైనా పర్యటనకు వెళ్లగా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు 15 గంటల పాటు నిర్బంధించారు. ఈ విషయాన్ని అతడు వీడియో ద్వారా వెల్లడించాడు. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తాను తీసుకున్న స్టాండ్ వల్లనే ఈ సమస్య వచ్చిందని చెప్పాడు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande