
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)
మహారాష్ట్రలోని దేవాడ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైద్యం కోసం నాగ్‌పూర్‌కు వెళ్లి తిరిగి వస్తున్న కారు బ్రిడ్జిపై నియంత్రణ కోల్పోయి కిందకు పడిపోవడంతో కాగజ్‌నగర్‌కు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు