ఢిల్లీలో పోలీసుల మెరుపు దాడి.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరస్తుల అరెస్ట్!
న్యూఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరస్థులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని నరేలా నివాసితులు అఫ్టల్ (అలియాస్ ఇమ్రాన్), చందన్ (అల
ఢిల్లీ ఎన్కౌంటర్


న్యూఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరస్థులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని నరేలా నివాసితులు అఫ్టల్ (అలియాస్ ఇమ్రాన్), చందన్ (అలియాస్ కాకు)గా గుర్తించారు. వీరిద్దరూ నరేలా పోలీస్ స్టేషన్ పరిధిలో 'బ్యాడ్ క్యారెక్టర్' (BC) జాబితాలో ఉన్నారని, వీరిపై ఇప్పటికే అనేక హత్యాయత్నం, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

నిందితుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీస్ బృందం నరేలాలో మాటు వేసింది. పోలీసులను చూడగానే నిందితులు పారిపోయే ప్రయత్నం చేస్తూ పోలీసులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు నిందితుల కాళ్లకు తగిలాయి. దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి రెండు పిస్టల్స్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ మరియు ఐదు ఖాళీ బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande