
ఢిల్లీ25,డిసెంబర్ (హి.స.)
కొద్దిరోజులుగా కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు దేశాల మధ్య వార్ నడుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఉద్రికత్తంగానే ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో కంబోడియాలో విష్ణువు విగ్రహం ధ్వంసమైంది. కంబోడియా భూభాగంలో అన్ సెస్ ప్రాంతంలో ఉన్న విగ్రహాన్ని ఒక జేసీబీ కూల్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ విగ్రహాన్ని థాయ్‌లాండే కూల్చేసిందని కంబోడియా అధికారి ఒకరు ఆరోపించారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇక ప్రీహ్ విహార్ ప్రతినిధి లిమ్ చాన్‌పాన్హా మాట్లాడుతూ.. 2014లో నిర్మించిన విష్ణు విగ్రహాన్ని థాయ్‌లాండ్‌కు 100 మీటర్ల సరిహద్దు దూరంలో జరిగిందని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ