
ఢిల్లీ25,డిసెంబర్ (హి.స.)
ఇస్మాయిల్ హనియే హత్యను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుర్తుచేశారు. హత్యకు ముందు ఏం జరిగిందో. ఆయన్ను ఎలా కలుసుకున్నారో కీలక విషయాలను కేంద్రమంత్రి పంచుకున్నారు. అసలు ఇస్మాయిల్ హనియేను గడ్కరీ ఎందుకు కలుసుకున్నారు. ఆ విషయాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ.. ఇస్మాయిల్ హనియే హత్యకు కొన్ని గంటల ముందు ఏం జరిగిందో వివరించారు. హత్యకు ముందు ఇస్మాయిల్ హనియేను తాను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు.
ఇరాన్‌కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారోత్సవానికి భారతదేశం తరపున ప్రధాని మోడీ తనను ఇరాన్ పంపించారని చెప్పారు. టెహ్రాన్‌లోని ఐదు నక్షత్రాల హోటల్‌లో ఆయా దేశాధినేతలు, సీనియర్ రాజకీయ ప్రముఖులంతా ఒక దగ్గర చేరి అనధికారికంగా సమావేశమై టీ, కాఫీ తాగుతున్నారని.. ఆ సమయంలో ఇస్మాయిల్ హనియే కూడా అక్కడే ఉండడంతో కలిసినట్లు తెలిపారు. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమానికి అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తితో కలిసి హనియే కూడా కారులో వెళ్లడం ప్రత్యక్షంగా చూసినట్లు గుర్తుచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ