
ముంబై, 25 డిసెంబర్ (హి.స.)
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పండగ సీజన్లో డ్రగ్స్ సరఫరా పెరిగే అవకాశం ఉండటంతో నగరంలోని పబ్బులు, క్లబ్బులు, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ముఖ్యంగా రేవ్ పార్టీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. డ్రగ్స్ విక్రేతలతో పాటు వాటిని వినియోగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, పండగ వేడుకల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ముంబై పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..