ఒడిశా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.) ఒడిషా రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మా అటవీ ప్రాంతం
ఎన్కౌంటర్


హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)

ఒడిషా రాష్ట్రం కంధమాల్ జిల్లా

బెల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు కోటగడ్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.

దీంతో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు, బారి అలియాస్ రాకేష్, మరొకరు అమృత్గా గుర్తించారు. సంఘటన స్థలంలో రెండు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande