
న్యూఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.) దేశవ్యాప్తంగా నేడు క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. స్థానిక చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభు యేసుకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఢిల్లీలోని కేథడ్రల్ చర్చలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, ఉత్సాహాన్ని పంచే పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు