మావోయిస్టులకు మరో కోలుకోలేని దెబ్బ.. భద్రతా బలగాల విజయంపై అమిత్ షా హర్షం
న్యూఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.) ఒడిశాలోని కంధమాల్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉకేతో పాటు పలువురు కీలక సభ్యులు హతం కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఆపరేషనన్ను విజయవంతం చేసిన ఒడిశా పోలీసుల ఎస్ఓజీ (SOG),
అమిత్ షా హర్షం


న్యూఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.)

ఒడిశాలోని కంధమాల్ అడవుల్లో

జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉకేతో పాటు పలువురు కీలక సభ్యులు హతం కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఆపరేషనన్ను విజయవంతం చేసిన ఒడిశా పోలీసుల ఎస్ఓజీ (SOG), సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలను షా అభినందించారు. నక్సలిజం పై జరుగుతున్న పోరాటంలో ఇది ఒక కీలకమైన మలుపని, అంకితభావంతో పని చేస్తున్న భద్రతా బలగాల పరాక్రమాన్ని చూసి దేశం గర్విస్తోందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా మావోయిస్టు వ్యవస్థకు బలమైన దెబ్బ తగిలిందని అమిత్ షా తన ట్వీట్లో పునరుద్ఘాటించారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande