శంషాబాద్ లో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.) శంషాబాద్‌ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. శంషాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని జలవిహార్‌కు పిల్లలను తీసుకెళ్తున్న స్కూల్ బస్సును నేటి ఉదయం వెనక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొట్టిన
స్కూల్ బస్సు బోల్తా


హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)

శంషాబాద్‌ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. శంషాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని జలవిహార్‌కు పిల్లలను తీసుకెళ్తున్న స్కూల్ బస్సును నేటి ఉదయం వెనక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొట్టిన ప్రభావంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన పిల్లలను సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారి పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande