
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.) తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. 2025 డిసెంబర్ 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఆమోదంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు డిసెంబర్ 24న అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు.
సభ ప్రారంభమైన అనంతరం సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో కీలక అంశాలపై విస్తృత చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల నీటి కేటాయింపులు, పాలమూరు–రంగారెడ్డి సహా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎంపీటీసీ–జడ్పీటీసీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రణాళికపై హౌస్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు