అలీగఢ్ యూనివర్సిటీలో కాల్పులు.. ఉపాధ్యాయుడు హత్య
ఢిల్లీ25,డిసెంబర్ (హి.స.) ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో నడకకు వెళ్లిన ఉపాధ్యాయుడి తలపై రెండుసార్లు కాల్చడంతో అక్కడికక
అలీగఢ్ యూనివర్సిటీలో కాల్పులు.. ఉపాధ్యాయుడు హత్య


ఢిల్లీ25,డిసెంబర్ (హి.స.)

ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో నడకకు వెళ్లిన ఉపాధ్యాయుడి తలపై రెండుసార్లు కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఏబీకే హైస్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ బోధించే డానిష్ రావు.. ఇద్దరు సహోద్యోగులు బుధవారం సాయంత్రం నడకకు వెళ్లారు. కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతుండగా రాత్రి 8:50 గంటల సమయంలో కాల్పుల శబ్దాలతో మార్మోగింది. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. సమీపం నుంచి తలపై రెండు, మూడు సార్లు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో క్యాంపస్ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం దుండగులు పరారయ్యారు.

డానిష్ రావును వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ జాడోన్ తెలిపారు. ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande