
ఢిల్లీ25,డిసెంబర్ (హి.స.)
‘ దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శంఖ్ ఎయిర్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలకు షెడ్యూల్డ్ విమానాలు నడపడానికి ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేసింది.
తాజాగా కేరళకు చెందిన అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ సంస్థలకూ కేంద్ర పౌర విమానయానశాఖ నిరభ్యంతర పత్రం జారీచేసింది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలల్లో ఈ నాలుగు సంస్థలు తమ సర్వీసులను ప్రారంభించే అవకాశముందని మంత్రి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ