
కోల్‌కతా/ఢిల్లీ25,డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడి హత్యతోపాటు మైనార్టీలపై జరుగుతున్న∙దాడుల పట్ల పశ్చిమ బెంగాల్‌లో హిందూ సంఘాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్, సరిహద్దులోని ఓడరేవుల వద్ద బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
దీంతో, కోల్‌కతాలో హౌరా బ్రిడ్జి వైపు ర్యాలీగా వస్తున్న జనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బారీకేడ్లను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ సనాతన ఐక్య పరిషత్ ఆధ్వర్యంలో 24 పరగణాల జిల్లా, మాల్డా, కూచ్ బెహార్ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 18న బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ సిటీలో దీపూ చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని అల్లరిమూకలు కొట్టి చంపిన సంగతి తెలిసిందే
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ