సుపరిపాలన దాత, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేళ ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్
ఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.) మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) జయంతి వేళ ప్రధాని మోడీ (Prime Minister Modi) ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రదాని ట్వీట్‌లో భారత మాజీ ప్రధాని, నిలువెత్తు దేశభక్తికి నిదర్శనం ''భారతరత్న
Modi-conversation-PM-New-Zealand-FTA


ఢిల్లీ, 25 డిసెంబర్ (హి.స.)

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) జయంతి వేళ ప్రధాని మోడీ (Prime Minister Modi) ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రదాని ట్వీట్‌లో భారత మాజీ ప్రధాని, నిలువెత్తు దేశభక్తికి నిదర్శనం 'భారతరత్న' అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ రోజును ప్రభుత్వం 'సుపరిపాలన దినోత్సవం' (Good Governance Day) గా నిర్వహిస్తోంది.

తన జీవితాన్ని సంపూర్ణంగా రాష్ట్ర నిర్మాణం కోసం, సుపరిపాలన కోసం అంకితం చేసిన అటల్ జీ, కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, అద్భుతమైన వక్తగా, ఓజస్వి కవిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన ప్రసంగాలు ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేసేవి. దేశ చతుర్ముఖ అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు, చేపట్టిన సంస్కరణలు నేటికీ అభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తున్నాయి. అణు పరీక్షల ద్వారా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిన ధీశాలి ఆయన. ఆయన వ్యక్తిత్వం, నాయకత్వ పటిమ రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande