అమరావతి ఎకనామిక్ కారిడార్ గా అవతరించబోతోంది
అమరావతి, 3 డిసెంబర్ (హి.స.)రాజధాని అమరావతి ఎకనామిక్‌ కారిడార్‌గా అవతరించబోతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అమరావతి ఎకనామిక్‌ జోన్‌లో గుంటూరు, పల్నాడ
అమరావతి ఎకనామిక్ కారిడార్ గా అవతరించబోతోంది


అమరావతి, 3 డిసెంబర్ (హి.స.)రాజధాని అమరావతి ఎకనామిక్‌ కారిడార్‌గా అవతరించబోతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అమరావతి ఎకనామిక్‌ జోన్‌లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఎన్‌టీఆర్‌, ఏలూరు, త్వరలో ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలుంటాయి. ఈ నేపథ్యంలో అమరావతి ఎకనామిక్‌ కారిడార్‌కు త్వరలోనే రూపకల్పన జరగనుంది. విజన్‌ ప్రణాళికలు రూపకల్పన జరిగి కార్యరూపం దాల్చితే అమరావతి ఎకనామిక్‌ కారిడార్‌ రాష్ట్రానికే తలమానికంగా మారుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా అమరావతి ఎకనామిక్‌ కారిడార్‌ కార్యకలాపాల పర్యవేక్షణకు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం నియమించనుంది. ఈ కారిడార్‌ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉండనున్న దృష్ట్యా ప్రధానంగా ఫైనాన్స్‌, డీప్‌ టెక్నాలజీ, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ) సంస్థలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. రాజధానిలో ఇప్పటికే క్వాంటమ్‌ వ్యాలీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అమరావతిలో ఆర్థిక నగరాన్ని నిర్మించేందుకు ఇటీవలే అంకురార్పణ జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande