
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
భారత రూపాయి విలువ ఆల్టైమ్
కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ (Doller)తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా రూ.90 మార్కును దాటింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల ప్రాంతంలో 90.12 వద్ద ట్రేడ్ అవుతోంది. తాజా పరిణామంతో దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా దిగుమతులు, ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ (United States Federal Reserve) వడ్డీ రేట్లు పెంచడం, కొనసాగించడం, పెట్టుబడిదారులు సురక్షితమైన ఆశ్రయంగా భావించే డాలర్లోకి తమ పెట్టుబడులను మళ్లించడం రూపాయి మారకం విలువ పడిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..