
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా
పనికిరాడని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని అన్నారు. పవన్ను వెంటనే కేబినెట్ నుంచి బహిష్కరించాలని (లేదా బర్తరఫ్ చేయాలని) డిమాండ్ చేశారు. పవన్ రాజకీయాలు వదిలేసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదని అన్నారు. ప్రజా నాయకుడికి పవన్ ఏ మాత్రం పనికిరాడని అన్నారు. 'దిష్టి తగిలింది' లాంటి మాటలు మాట్లాడే సనాతనవాదికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు