జూబ్లీహిల్స్ ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. సినీ నిర్మాతపై కేసు నమోదు
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్లోని అత్యంత విలువైన ప్రాంతమైన జూబ్లీహిల్స్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఓ సినీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోగస్ పత్రాలు సృష్టించి సుమారు 600 గజాల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్న
సినీ నిర్మాతపై కేసు


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

హైదరాబాద్లోని అత్యంత విలువైన

ప్రాంతమైన జూబ్లీహిల్స్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ఓ సినీ నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోగస్ పత్రాలు సృష్టించి సుమారు 600 గజాల స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన నిర్మాత బషీద్ షేక్పై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 70లోని సర్వే నంబరు 403లో ప్రభుత్వానికి చెందిన 600 గజాల స్థలం ఉంది. రెండు రోజుల క్రితం రెవెన్యూ సిబ్బంది తనిఖీలకు వెళ్లగా, ఆ స్థలంలో ఓ కంటైనర్తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండటాన్ని గమనించారు.

నకిలీ పత్రాలను ఉపయోగించి జూబ్లీహిల్స్ లోని ఈ విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు బషీద్ ప్రయత్నిస్తున్నారని తహసీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు బషీద్ షేక్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande