
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో
విచారణ పూర్తయింది. ఈ మేరకు 2005 నుంచి 2020 మధ్య కాలంలో జరిగిన అవకతవకలపై గోల్కొండ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ నవంబర్ 27న అందుకు సంబంధించిన రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన 15 మందిని బాధ్యులుగా చేస్తూ.. తుది నివేదిక వెలువడింది. వారిలో చిత్రపురి కాలనీ మాజీ ప్రెసిడెంట్లు కొమర వెంకటేశ్, నటుడు బినోద్ బాల, మాజీ సెక్రటరీ కృష్ణ మోహన్, మాజీ ట్రెజరర్, నటుడు పరుచూరి వెంకటేశ్వర రావు, ఎంసీ మెంబర్లు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కె. రాజేశ్వర రావు, దేవినేని బ్రహ్మానంద రావు, చంద్రమధు, కె. ఉదయ భాస్కర్, జె. రామయ్య, నటుడు కాదంబరి కిరణ్, అనిల్ కుమార్ వల్లభనేని, ఎ. మహానంద రెడ్డి, రఘు బత్తుల, ప్రవీణ్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ మేరకు బాధ్యుల నుంచి రూ.43.78 కోట్లు రికవరీ చేయాలని.. అటు ప్రభుత్వానికి, ఇటు రిపోర్టులో పేర్లు ఉన్న 15 మందికి గోల్కొండ కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ నివేదిక కాపీని పంపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు