
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
హయత్ నగర్ పరిధిలోని శివగంగ
గురించి కాలనీలో మూగబాలుడు ప్రేమ్ చంద్పై మంగళవారం వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చలించిపోయారు. వెంటనే సీఎంవో, జీహెచ్ఎంసీ అధికారులతో ఢిల్లీ నుండి మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఖర్చుకు వెనుకాడకుండా బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. బాలుడు ప్రేమ్ చంద్ వైద్య ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. బాలుడి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి వారి బాగోగులు పరిశీలించి, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని రేవంత్ ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు