
శ్రీనగర్, 3 డిసెంబర్ (హి.స.)
జమ్మూ కశ్మిర్ లోని శ్రీనగర్లో ఈ
ఏడాది ఉహించినదానికంటే ముందూ శీతాకాలం ప్రారంభమైంది. గతంలో చలి ప్రభావం నెమ్మదిగా పెరిగేది. కానీ ఈ సారి అలా కాకుండా.. చలి ప్రభావం మరింత తీవ్ర మవుతూ.. ఈ రోజు ఉదయాన్నే నగరంలో కనిష్ఠంగా మైనస్ 2.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్ లోయలోని ఎగువ ప్రాంతాల్లో తాజాగా కురిసిన మంచు (fresh snowfall) ఈ చలి తీవ్రతను మరింత పెంచింది. అయినప్పటికీ, రాత్రిపూట ఆకాశాన్ని కమ్మేసిన మేఘాలు (overnight cloud cover) కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఈ మేఘాల కారణంగా ఆ ప్రాంతం అంతటా కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు రెండు డిగ్రీల వరకు పెరిగాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు