
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రాబోయే కొత్త సినిమాలకు సంబంధించిన వార్తలెన్నో వైరల్ అవుతున్నాయి. ఆయన బ్యానర్లో భారీ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపద్యంలో నిర్మాత దిల్ రాజు టీం కీలక ప్రకటన విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతూ.. తాము ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్లో ఓ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసినట్లు వెల్లడించారు.
ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ అనీస్ బజ్మీ(Anees Bazmee) దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. స్క్రిప్ట్ వర్క్, నటీనటులు ఎంపిక ఇతర సన్నాహాలు జరగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తాము. దయచేసి మా వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా ఎలాంటి రూమర్స్ వ్యాప్తి చేయవద్దు, తప్పుడు వార్తలను నమ్మొద్దు. దయచేసి ఎవరూ సొంతంగా అంచనాలు వేయడం లేనిపోని వార్తలు షేర్ చేయడం ఆపాలని ప్రేక్షకులను కోరుతున్నామని అన్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మేము స్వయంగా మీతో పంచుకుంటాం.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు