
నిజామాబాద్, 3 డిసెంబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు