ఫార్ములా ఈ-రేసు కేసులో బిగ్ అప్డేట్... అరవింద్ కుమార్పై చర్యలకు DoPTకి సీఎస్ లేఖ
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-రేసు (Formule E-Race) ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్స
ఫార్ములా ఈ-రేసు


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-రేసు (Formule E-Race) ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఇవాళ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ (DoPT)కి లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఏసీబీ ఆయనపై చార్జ్షీటు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande