రేవంత్ సర్కారు తీరుపై హరీశ్రావు సెటైర్లు
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) ''మింగడానికి మెతుకులేదు కానీ.. మీసాలకు సంపెంగి నూనె'' అన్నట్లుగా రాష్ట్రంలో రేవంత్ సర్కారు తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీ మెస్లో పాడైపోయిన అన్నం పెడుతున
హరీశ్రావు సెటైర్లు


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

'మింగడానికి మెతుకులేదు కానీ..

మీసాలకు సంపెంగి నూనె' అన్నట్లుగా రాష్ట్రంలో రేవంత్ సర్కారు తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీ మెస్లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడంపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందని కామెంట్ చేశారు.

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్ల నిధులు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు.. కనీసం విద్యార్థులకు ఒక పూట మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande