జడ్చర్లలో పవన్ సినిమాలు ఆడనివ్వను.. మరోసారి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
జడ్చర్ల, 3 డిసెంబర్ (హి.స.) కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తెలంగాణ వాళ్లకు సెంటిమెంట్ ఎక్కువ అని అన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం వల్లనే ప్ర
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి


జడ్చర్ల, 3 డిసెంబర్ (హి.స.)

కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి

తగిలింది అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తెలంగాణ వాళ్లకు సెంటిమెంట్ ఎక్కువ అని అన్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని తాను మొన్న కోరానని కానీ ఇప్పటి వరకు పవన్ చెప్పలేదని అసలు స్పందించడం కూడా లేదన్నారు. తమిళనాడు, ఢిల్లీ పోతే రెడ్ కార్పెట్ వేస్తారని పవన్ స్పందించడం లేదా అని ప్రశ్నించారు.

కానీ తన నియోజకవర్గం జడ్చర్లలో మాత్రం పవన్ సినిమాలు ఆడనివ్వనని చెప్పారు. తాను పవన్ కల్యాణ్ అభిమానే అని కానీ అంతకంటే తనకు తెలంగాణ సెంటిమెంటే ఎక్కువని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande