అమరులకు స్థూపం కట్టారు కానీ ఒక్క పథకానికి కూడా అమరుల పేరు పెట్టలేదు.. జాగృతి కవిత.
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ హయాంలో అమరులకు స్థూపం కట్టారు కానీ ఒక్క పథకానికి కూడా అమరుల పేరు పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అలాంటి రాష
జాగృతి కవిత.


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ హయాంలో అమరులకు స్థూపం కట్టారు కానీ ఒక్క పథకానికి కూడా అమరుల పేరు పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అలాంటి రాష్ట్రంలో అమరుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్ , కాంగ్రెస్లకు రాలేదని దుయ్యబట్టారు. ఈ ఒరవడి అమరవీరులకు గౌరవం దక్కి వారి పేర్లు చరిత్రలో నిలవాలని ఆకాంక్షించారు. మలిదశ తెలంగాణ మారి ఉద్యమంలో అసువులు బాసిన అమరుడు శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. కాంగ్రెస్ రాజీవ్, ఇందిర, మన్మోహన్ సింగ్ పేర్లను మాత్రం ప్రభుత్వ పథకాలకు పెడుతోందని కానీ శ్రీకాంతా చారి పేరు ఒక్క పథకానికి కూడా పెట్టలేదని విర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande