రేవంత్ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఎంపీ చామల కౌంటర్
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడారు అంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి 140ఏళ
ఎంపీ చామల కౌంటర్


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) డీసీసీ నూతన అధ్యక్షుల

సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడారు అంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి 140ఏళ్ల చరిత్ర ఉందని.. పార్టీలో ఎందరో నాయకులు ఉంటే తమకు నచ్చిన నాయకులను అనుకరిస్తారని హిందూదేవుళ్లను తీసుకుని ఉదాహరణగా చెప్పారన్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పే ప్రయత్నం చేశారన్నారు. కులాన్ని, మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు.

కానీ దానిని పట్టుకుని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కేవలం రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2047 కోసం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande