హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. బీజేపీ ఆఫీసు వద్ద భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. నిన్న గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ (PCC) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్
పోలీసుల మోహరింపు


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. నిన్న గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ (PCC) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారని ప్రశ్నించారు. మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పలు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలను నిరసనగా యువ మోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను అక్కడే అడ్డుకునేలా బీజేపీ ఆఫీసుకు ఇరువైపులా బారికేడ్లతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande