
అమరావతి, 3 డిసెంబర్ (హి.స.)ప్రభుత్వ శాఖలన్నింటికీ ఉమ్మడి డేటా సెంటర్‌గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారమంతా క్రోడీకరించి డేటా లేక్ ద్వారా విశ్లేషించనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మెరుగ్గా పౌరసేవలు అందించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి సేవలను సులభతరం చేయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ