
తెలంగాణ, 3 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో నేడు నాలుగు జిల్లాల్లో
వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగితా జిల్లాలతో పాటు హైదరాబాద్ లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో కోల్డ్ వేవ్ ఉంటుందని హెచ్చరించారు. అంతేకాకుండా రేపు, ఎల్లుండి సౌత్ తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 6,7 తేదీల్లో పొడివాతావరణం ఉంటుందని మళ్లీ డిసెంబర్ 9న తెలంగాణ వ్యాప్తంగా వణికించే చలి పెడుతుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు