
రాజన్న సిరిసిల్ల, 3 డిసెంబర్ (హి.స.)
మార్కులు తక్కువ వచ్చాయని ఇంటర్ విద్యార్థినిపై మహిళా లెక్చరర్ దాష్టీకం గా ప్రవర్తించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది... సిరిసిల్ల పట్టణం లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ యువతికి యూనిట్ టెస్ట్ లో మార్కులు తక్కువ వచ్చాయని కావ్యశ్రీ అనే సంస్కృతం లెక్చరర్ బుధవారం విద్యార్థినిని కర్రతో చితకబాదింది. కర్ర విరిగిపోయే వరకు కొట్టడంతో విద్యార్థినికి గాయాలయ్యాయి. కాగా విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కళాశాలలో ఆందోళన చేశారు. లెక్చరర్ చేత క్షమాపణ చెప్పించి, సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు