
ఆసిఫాబాద్, 3 డిసెంబర్ (హి.స.) ఇటీవల కాగజ్నగర్ పట్టణంలోని
14 వార్డు ద్వారకానగర్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. మంగళవారం రాత్రి కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. గత నెల 28న ద్వారకానగర్లో నివాసం ఉంటున్న చిలుక వీరమ్మ ఇంటికి సార్ పుస్తకాలు పంపించారు. తీసుకొండి అంటూ వచ్చి.. వృద్ధురాలిపై దాడి మెడలోని గొలుసు, ఉంగరాలు చోరీ చేసి పారిపోయారు.
సీసీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో ప్రత్యేక పోలిస్ బృందం నిందితులను గుర్తించారు. వేముల బాలకృష్ణ, బండి నీలేష్, పోగుల తిరుపతి అరెస్ట్ కాగా దూల రాజ్కుమార్ పరారీలో ఉన్నాడు. వారీ నుంచి 11 గ్రాముల గొలుసు. 6 గ్రాముల ఐదు ఉంగరాలు. నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అరెస్టు రిమాండ్ చేసి జైలుకు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు