విపక్షాల ఆరోపణల వేళ 10 శాతం పెరిగిన సంచార్ సాథీ యాప్ డౌన్లోడ్స్
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) పౌరుల వ్యక్తిగత వ్యవహారాలపై నిఘా వేసేందుకే కేంద్రం సంచార్ సాథీ పేరుతో స్నూపింగ్ యాప్ను ప్రయోగించాలను చూస్తోందని ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ మరోవైపు ఈ యాప్ డౌన్లోడ్స్ భారీగా పెరిగినట్లు టెలికాం విభాగం
సంచార్ సాథీ


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

పౌరుల వ్యక్తిగత వ్యవహారాలపై నిఘా వేసేందుకే కేంద్రం సంచార్ సాథీ పేరుతో స్నూపింగ్ యాప్ను ప్రయోగించాలను చూస్తోందని ఓ వైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ మరోవైపు ఈ యాప్ డౌన్లోడ్స్ భారీగా పెరిగినట్లు టెలికాం విభాగం డీవోటీ (DoT) వెల్లడించింది.

మంగళవారం ఈ యాప్ డౌన్ లోడ్స్ ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు తెలిపింది. నిన్న ఒకే రోజు డౌన్లోడ్ లు సగటున రోజుకు 60 వేల నుంచి 10 రెట్లు పెరిగి దాదాపు 6 లక్షలకు చేరుకున్నాయని డీఓటీ వర్గాలు చెప్పారు. అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేయడానికి ముందే 1.5 కోట్ల మంది ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు. తాజా వివాదం వేళ మరింత పెరిగినట్లు సంబంధింత అధికారులు వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande