అరావళి కొండలకు మోదీ ప్రభుత్వం 'మరణశాసనం' రాసింది: సోనియా గాంధీ
న్యూఢిల్లీ, 3 డిసెంబర్ (హి.స.) అటవీ, పర్యావరణ పరిరక్షణ పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. మోడీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ విషయంలో ముఖ్యంగా దుర్మార్గపు నిస్సత్తువన
సోనియా గాంధీ


న్యూఢిల్లీ, 3 డిసెంబర్ (హి.స.)

అటవీ, పర్యావరణ పరిరక్షణ పై కేంద్ర

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. మోడీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ విషయంలో ముఖ్యంగా దుర్మార్గపు నిస్సత్తువను ప్రదర్శించిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు అరావళి కొండలకు మరణ శాసనం రాసినట్లేనని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ రక్షణకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె తీవ్రంగా విమర్శించారు.

పార్లమెంట్ ఆవరణలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం పార్లమెంటులో బుల్డోజ్ చేసిన అటవీ (సంరక్షణ) చట్టం, 1980 సవరణలను, అటవీ సంరక్షణ నియమాలు (2022)**2 తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అరావళి శ్రేణిలోని 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ఏ కొండ అయినా మైనింగ్ ఆంక్షలకు లోబడి ఉండదని ప్రభుత్వం ప్రకటించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఎత్తు పరిమితి కంటే తక్కువగా ఉన్న అరావళి శ్రేణిలోని 90% భాగాన్ని అక్రమ మైనింగ్ మాఫియాలు సర్వనాశనం చేయడానికి ఇది బహిరంగ ఆహ్వానమని ఆమె ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande