బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ జిల్లాల్లో పిడుగులతో వానలు!
అమరావతి, 3 డిసెంబర్ (హి.స.) నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను వాయుగుండం బలపడి కొనసాగుతుంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావం
Heavy rains in Kerala


అమరావతి, 3 డిసెంబర్ (హి.స.) నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను వాయుగుండం బలపడి కొనసాగుతుంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.

తిరుపతి జిల్లా మల్లంలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా తడ, చిత్తమూరులో 5, పూలతోటలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. సముద్ర తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేటలో 52 తీర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande