బ్రేకులు ఫెయిల్.. నగరంలో టిప్పర్ బీభత్సం
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) బ్రేకులు ఫెయిల్ అయి టిప్పర్ బీభత్సం సృష్టించిన ఘటన నగరంలో ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మలక్పేట నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్తున్న ఓ టిప్పర్కు తిరుమల హిల్స్ వద్దకు రాగానే అకస్మాత్తుగా బ్రేకుల
టిప్పర్ బీభత్సం


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

బ్రేకులు ఫెయిల్ అయి టిప్పర్ బీభత్సం సృష్టించిన ఘటన నగరంలో ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మలక్పేట నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్తున్న ఓ టిప్పర్కు తిరుమల హిల్స్ వద్దకు రాగానే అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అనంతరం వేగాన్ని అదుపు చేయలేకపోయిన డ్రైవర్ ముందు ఉన్న డివైడర్తో పాటు ఆ పక్కనే ఉన్న లారీ, బస్సును కూడా బలంగా ఢీకొట్టాడు. దీంతో కాసేపు ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ దుర్ఘటనలో మొత్తం మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మధ్యలో అడ్డంగా ఉన్న టిప్పర్తో పాటు లారీ, బస్సును పక్కకు తప్పించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande