
అమరావతి, 3 డిసెంబర్ (హి.స.)
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగం అయ్యేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన నాయకులు పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. తమ ప్రాంత అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోశించాలన్నారు.
గ్రామస్థాయిలో ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని వారు గ్రామాభివృద్ధిలో భాగమవ్వాలని సూచించారు. అదే విధంగా మండల, నియెజకవర్గ, లోక్ సభ నియోజకవర్గాల అభివృద్ధిపైనా ఆయా కమిటీలు దృష్టి పెట్టాలన్నారు. పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో కమిటీ ఏర్పాటైందని ఆ కమిటీ పనితీరు చూసి రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలను నెలలోనే పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుండే పర్యవేక్షించాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV