
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.)
జాతివివక్ష(Racism) అనేది మానవత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరమైన నేరమని, ఇది భారత రాజ్యాంగ విలువలకే విఘాతమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జాతివివక్ష ఏ రూపంలో ఉన్నా దానిని సహించకూడదని ఆయన స్పష్టం చేశారు. డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యను ప్రస్తావిస్తూ.. ఈ ఘటన పట్ల కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివక్ష, అధికార దుర్వినియోగం కలిస్తే ఎంతటి ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయో ఈ సంఘటన గుర్తు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నేరాలు కేవలం విడిగా జరిగిన సంఘటనలు కావని, ద్వేషాన్ని, వివక్షను సహించడం వల్ల కలిగే ముప్పుకు ఇవి ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..