
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట
పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవతలను దూషించాడని అన్వేష్ పై సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు. పోలీసులను కలిసిన అనంతరం కరాటే కల్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్వేష్ ను అన్ సబ్ స్క్రైబ్ చేయాలన్నారు.
అతడు హిందూ, ముస్లిం గొడవలను రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. ఇంత నీచంగా మాట్లాడుతున్న అన్వేష్ కు 2.5 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఇచ్చింది మనమేనని, అన్వేష్ కు వస్తున్న ప్రతి రూపాయి మన దేశం నుంచి, ముఖ్యంగా తెలుగు వారి నుంచే వస్తోందన్నారు. కాబట్టి వెంటనే అతడి ఛానల్ ను అన్ సబ్స్టేబ్ చేయాలన్నారు. ఇక ఇప్పటికే అన్వేష్ పై రెండు కేసులు నమోదయ్యాయి. అతడిని భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అతడిని దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..