
హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.)
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందనాదీప్తి వెల్లడించారు. ఈ ఏడాది 2,607 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇవాళ వార్షిక నివేదికను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది 500 మంది చిన్నారులను రక్షించామని, ఈ ఏడాది మొత్తం 1,317 మంది చనిపోయారని తెలిపారు. ఆత్మహత్యలు జరిగే ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు. 810 కిలోల గంజాయి సీజ్ చేశామని ఎన్పీడీఎస్ చట్టం కింద 54 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది 1,322 ఫోన్లు రికవరీ చేశామన్నారు. 12.25 కోట్ల విలువైన డ్రగ్స్ ను జీఆర్పీ ద్వారా స్వాధీనం చేసుకున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..