మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా : CM చంద్రబాబు
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)కొత్త ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన తన ఎక్స్ అధికారిక ఖాతాలో పర్సనల్ పోస్టును ప్రజలతో
చంద్రబాబు


అమరావతి, 31 డిసెంబర్ (హి.స.)కొత్త ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అన్నారు. తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన తన ఎక్స్ అధికారిక ఖాతాలో పర్సనల్ పోస్టును ప్రజలతో పంచుకున్నారు. అయితే ఒకరోజు ముందుగానే పింఛన్ దారులకు ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) కింద పింఛన్ ను పంపిణీ చేస్తున్నారు. అది కూడా ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని అధికారులు అందజేస్తున్నారు. చలి పులిని తట్టుకుంటూ పంపిణీని కొనసాగిస్తున్నారు.

రేపటి నుంచి జనవరి 1, 2026 నూతన సంవత్సరం ప్రారంభం. కొత్త ఏడాది ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని.. ముఖ్యంగా పింఛన్ దారులు నూతన సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలకాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ముందుగానే డిసెంబర్ 31, 2025న అంటే ఒకరోజు ముందే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ మొత్వాన్ని ఇండ్ల వద్దకే వెళ్లి అందించేలా అధికారులను ఆదేశించింది. దీంతో ఉదయం నుంచే పంపిణీ ప్రారంభమైంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్టును చేశారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande