
అమరావతి, 4 డిసెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 13వ ఎస్ఐపీబీ సమావేశం ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు మంత్రి కందుల దుర్గేశ్ )వివరించారు. సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో కూడా భారీగా ఎంవోయూలు జరిగాయని గుర్తుచేశారు. పెద్దఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ఈ 18 నెలల్లో ఇచ్చామని తెలిపారుమంత్రి కందుల దుర్గేశ్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ