
పల్నాడు , 4 డిసెంబర్ (హి.స.),అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈరోజు (గురువారం) ప్రారంభమైంది. ఇందులో భాగంగా అమరావతి మండలం యండ్రాయిలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ (Minister Narayana), ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. రెండో విడతలో అమరావతి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు భూమిని సేకరించనున్నారు. ముందుగా యండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అమరావతి కోసం యండ్రాయి రైతు నంబూరి బలరాం 4 ఎకరాల భూముని ఇచ్చారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమక్షంలో మంత్రి నారాయణకు పొలం పత్రాలను రైతు నంబూరి అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ