జహీరాబాద్ లో విషాదం.. చెట్టు కొమ్మ విరిగి పడి వ్యక్తి దుర్మరణం
జహీరాబాద్, 4 డిసెంబర్ (హి.స.) జహీరాబాద్ మండలం శేకాపూర్ గ్రామంలో చెట్టు కొమ్మ విరిగి పడి తలకు బలంగా తగలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన అశోక్ (45 ) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం ఉదయం మృతుడితో పాటు ఇసాముద్దీన్, గౌస
జహీరాబాద్లో విషాదం


జహీరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)

జహీరాబాద్ మండలం శేకాపూర్

గ్రామంలో చెట్టు కొమ్మ విరిగి పడి తలకు బలంగా తగలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనలో గ్రామానికి చెందిన అశోక్ (45 ) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం ఉదయం మృతుడితో పాటు ఇసాముద్దీన్, గౌస్, చిన్న నలుగురు చెట్టు నరికే పనికి వెళ్లారు. ఇసాముద్దీన్ చెట్టు కోయగా.. కిందపడ్డ చెట్టు కొమ్ము అశోక్ తలకు బలంగా తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande