
ఆదిలాబాద్, 4 డిసెంబర్ (హి.స.) ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంది. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నాం.. రెండేళ్ల నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న వయసులోనే నాకు ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు విపక్ష ఎమ్మెల్యేలను అనుమతించలేదని గుర్తుచేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..